NTV Telugu Site icon

TS POLYCET: నేడే టీఎస్ పాలిసెట్‌ ఫ‌లితాలు

Ts Polises

Ts Polises

TS POLYCET: తెలంగాణ పాలిసెట్ (TS POLYCET-2023) ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ ఫలితాలను వెల్లడిస్తారు. పరీక్ష ముగిసిన 8 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 17న టీఎస్‌ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 17 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

పాలీసెట్ ప్రవేశ పరీక్షకు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా 98,273 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీ ఇప్పటికే విడుదలైంది. అలాగే TS POLYCET ఫలితాలు 2023 మే 26న విడుదలయ్యే అవకాశం ఉంది. సంబంధిత సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
Lakshmi Stotra: మనస్సులో కోరికలు నెరవేలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి