Site icon NTV Telugu

Errabelli Pradeep: గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభం..!

Errabelli Pradeep

Errabelli Pradeep

Errabelli Pradeep: తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. కొద్దిరోజుల నుంచి వచ్చిన వార్తులు ఇవాల వాస్తవమయ్యాయి. నేడు కేసీఆర్‌ మంత్రి వర్గంలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ప్రదీప్ రావు ప్రకటించారు. అనంతరంలో వరంగల్‌ జిల్లా ఆయన నివాసంలో మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పనిచేయని టీఆర్ఎస్ నేతల బుజ్జగింపులు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చా అని పేర్కొన్నారు. ప్రజలకు కనీసం సహాయం చేయలేకపోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

9 యేళ్లు టీఆర్ఎస్ లో క్రమశిక్షణతో ఉండి నిస్వార్ధంగా పనిచేశానని పేర్కొన్నారు. పదవులు ఇయ్యకున్నా పార్టీకి సేవ చేస్తూనే ఉన్నాను అంటూ మండిపడ్డారు. కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభం అంటూ ఆయన ప్రశ్నించారు. సంస్కారం లేని నాయకులకు ప్రజలే బుద్ది చెప్తారని ఆయన ఆరోపించారు. ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదని ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు. వరంగల్ తూర్పు ప్రజలతో కలిసి ముందుకు నడుస్తా అని ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు పార్టీకి బై..బై.. చెప్పడంతో.. టీఆర్‌ఎస్‌ లో చర్చనీయాంశంగా మారింది.

read also: ISRO: ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం.. ఇంకా అందని డేటా

అయితే.. ఆగస్టు 2న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు పార్టీకి బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఆగస్టు 7వ తేదీన టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తారని మీడియాలో ప్రచారం అయ్యింది . అయితే ఈ క్రమంలోనే ఆగస్టు 3న అనుచరులతో ప్రదీప్‌ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి, టీఆర్‌ఎస్‌కు రాజీనామాతో పాటు తన భవిష్యత ప్రణాళికలపై చర్చించనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 2024 ఎన్నికలే లక్ష్యంగా చేసుకొని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే ఆయా పార్టీల జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ పార్టీల బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవలే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీని వీటి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. బీజేపీని భుజాన ఎత్తుకుంటూ ప్రసంగిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సైతం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, మాతో టచ్‌లో ఉంటున్నారని బాంబు పేల్చిన విషయం తెలిసిందే.
Film Chamber: తెలుగు రాష్ట్రాల సినిమా డిస్ట్రిబ్యూటర్ల సమావేశం.. టికెట్ రేట్లపైనా?

Exit mobile version