నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ ఇక, వరుసగా నోటిఫికేషన్లు ఉంటాయంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.. అయితే, కొంత గ్యాప్ వచ్చినా.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది సర్కార్.. ఇప్పటికే హోంశాఖ సహా.. ఇతర కొన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు తీపికబురు చెబుతూ.. పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్.. కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది..
Read Also: Talasani : మాకు ప్రజలతో పొత్తులు… సింగిల్‌గానే పోటీ చేస్తాం..
రాష్ట్రవ్యాప్తంగా 16,027 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.. అందులో టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, సివిల్ కానిస్టేబుళ్లు 4,965 పోస్టులు, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,423 పోస్టులు ఉండగా.. 414 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇక, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100గా పోస్టులు ఉన్నాయి.. మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. www.tslprb.inలో దరఖాస్తు చేసుకోవచ్చు అని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.