NTV Telugu Site icon

మోడల్ స్కూల్స్ ప్ర‌వేశ ప‌రీక్ష వాయిదా..

Model School

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తోన్న స‌మ‌యంలో.. వ‌రుస‌గా చాలా ప‌రీక్ష‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి.. ఇక‌, కొన్ని ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది ప్ర‌భుత్వం.. తాజాగా.. మోడ‌ల్ స్కూళ్ల‌లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించాల్సిన ప‌రీక్ష‌ను కూడా వాయిదా వేసింది ప్ర‌భుత్వం… షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల (జూన్‌) 6వ తేదీన 6వ తరగతి అడ్మిషన్స్ కోసం, 5వ తేదీన 7 నుండి 10 వ తరగతిలలో ఖాళీ సీట్ల అడ్మిషన్స్ కోసం ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంది.. కానీ, కరోన నేపథ్యంలో వాయిదా వేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. దరఖాస్తుల‌ గడువు మ‌రోసారి పొడిగించింది ప్ర‌భుత్వం… జూన్ 20వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌కు అవ‌కాశం క‌ల్పించింది.