TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు (24న) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నట్లు వెల్లడించారు. పలితాల కోసం https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
Read also: Yarlagadda VenkatRao: ఈ నెల 24న యార్లగడ్డ వెంకట్రావ్ నామినేషన్..
అయితే.. తొలుత ఫలితాలు ఇవాళ (మంగళవారం) విడుదల చేయాలని భావించారు. కానీ పలు కారణాలవల్ల మంగళవారం కుదరదని రేపు (బుధవారం) ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక.. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు.
Read also: KCR: రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సుయాత్ర..
మరోవైపు తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనిని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని SSC బోర్డు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు. సమాధాన పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 20న మూల్యాంకనం పూర్తికాగా.. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే.. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ముందుగానే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అలాగే.. ఫలితాలు కూడా కాస్త ముందుగానే విడుదల చేస్తున్నారు.
Yarlagadda VenkatRao: ఈ నెల 24న యార్లగడ్డ వెంకట్రావ్ నామినేషన్..