NTV Telugu Site icon

మొదటివారంలో ఇంటర్‌ ఫలితాలు

students

students

డిసెంబర్ మొదటి వారంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధం అయ్యింది తెలంగాణ ఇంటర్‌ మీడియట్‌ బోర్డు.. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఇంటర్‌ ఫలితాలు ఉంటాయని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.. కాగా, గత నెల 25 నుండి ఈ నెల మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు అధికారులు.. ఇక, ఈ నెల 19వ తేదీతో స్పాట్ వాల్యుయేషన్‌ను కూడా ముగించారు… ప్రస్తుతం మార్క్స్ డేటా క్రోడీకరణ పని కొనసాగుతుండగా… ఆ ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్‌ మొదటి వారంలోనే ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఈ ఏడాది 4 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.. అయితే, ఫలితాలను బట్టి ఫెయిల్‌ అయిన విద్యార్థులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.