తెలంగాణలోకి వచ్చే పేషెంట్లకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ తప్పనిసరి చేసిన సర్కార్… కోవిడ్ పేషెంట్ల అడ్మిషన్ కోసం ముందే ఆస్పత్రి అనుమతి అవసరమని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంబులెన్స్ లేదా వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని.. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తిరగడం వల్ల కూడా కరోనా వస్తుందని..పేర్కొంది సర్కార్. ఎపిడమిక్ యాక్ట్ ద్వారా ఈ గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ కంట్రోల్ రూమ్ కు ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవాలని.. రోగులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని పేర్కొంది. దాని ద్వారానే.. కంట్రోల్ రూమ్ నుంచి రోగులకు పాస్ మంజూర్ చేస్తామని వెల్లడించింది తెలంగాణ సర్కార్.
తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే.. ఇక ఈ రూల్స్ పాటించాల్సిందే
