NTV Telugu Site icon

TS Government: పశుసంవర్దక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై కేసు.. ఏసీబీకి బదిలీ

Revanth Reddy

Revanth Reddy

TS Government:పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైన ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుతో పాటు గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపైనా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తేలింది. కాగా.. గచ్చిబౌలిలో అధికారులపై కేసు నమోదైంది. నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్లు పోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Read also: Hyderabad to Ayodhya: గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనేక ప్రభుత్వ ఫైళ్లను ధ్వంసం చేసి, దగ్ధం చేసిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మసాబ్ ట్యాంక్ పశుసంవర్ధక శాఖలోనూ ఫైళ్లు మాయమైన ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఓఎస్‌డీ కల్యాణ్‌ కార్యాలయ ఫైళ్లు గల్లంతయ్యాయి. కిటికీ గ్రిల్స్ తొలగించిన దుండగులు ఫైళ్లను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఓఎస్డీ కళ్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజా, వెంకటేష్, ప్రశాంత్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొత్త ప్రభుత్వం గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని గుర్తించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు గుర్తించారు. ఈ మేరకు పలువురు అధికారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Prashanth Varma: జై హనుమాన్ కన్నా ముందే మరో సూపర్ హీరో సినిమా… ఇప్పటికే షూటింగ్ కంప్లీట్