తెలంగాణలో ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు.. ఇక, ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. 150 మార్క్ లకు ప్రశ్నలకు 2 గంటల సమయం కేటాయించారు.. సబ్జెక్టులో 60 మార్కులు (సైన్స్ 20 మార్క్స్, సోషల్ 20 మార్క్స్, మాథ్స్ 20 మార్క్స్).. సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు 10 వ తరగతి.. అంత లోపు తరగతుల సిలబస్ నుండి మాత్రమే ఉంటాయి.. టీచింగ్ ఆప్టిట్యూడ్ 20 మార్క్స్, కంప్యూటర్ అవేర్ నెస్ 20మార్క్స్, జనరల్ నాలెడ్జి , విద్యా అంశాలు 30, జనరల్ ఇంగ్లీషు 20 మార్కులు ఉండబోతున్నాయి.. విద్యార్థుల ఎలిజిబిలిటీని బట్టి అడ్మిషన్స్ టైమ్ లో మెథడాలజీలను కేటాయించనున్నారు.
ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టులో పరీక్ష..
EdCET