NTV Telugu Site icon

TS EAMCET Results: ఇంజినీరింగ్‌లో అమ్మాయిలే టాప్..

Ts Eamcet Results

Ts Eamcet Results

TS EAMCET Results 2023: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత రాణించారు. ఇంజినీరింగ్‌లో అనిరుధ్‌కు మొదటి ర్యాంకు సాధించగా.. వెంకట మణిందర్‌రెడ్డికి రెండో ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్‌లో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాలను https://ntvtelugu.com/telangana-eamcet-results-2023 ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. ఫలితాలను ఉదయం 10 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కేంద్రాలలో మే 10 నుండి 14 వరకు నిర్వహించిన TS EAMCET 2023కి మొత్తం 3,20,683 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి రావడంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు తీసుకొచ్చారు. TS Eamcet ఎగ్జామ్స్ 2023లో హాజరైన అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్ నంబర్‌ని ఉపయోగించి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల ప్రకటన తర్వాత, దీని కోసం అందించిన బాక్స్‌లో అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి. TS EMCET ఫలితాలు 2023 దాని ప్రకటన తర్వాత eamcet.tsche.ac.inలో తనిఖీ చేసుకోవచ్చు.

మే 12 నుంచి 15 వరకు ఆరు బ్యాచ్‌లుగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్వహించగా.. ఇటీవల ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్లు విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు లక్ష మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్‌లో అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల ఫలితాల ర్యాంకులు, మార్కులు విడుదల చేస్తారు.ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. మెడికల్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్ల వివరాలను కూడా వెల్లడించనున్నారు. EAMCET ఫలితాల కోసం eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేయవచ్చు.

ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Live: TS EAMCET Results 2023 Live | Minister Sabitha Indra Reddy | ఎంసెట్ 2023 ఫలితాలు | Ntv