Telangana Assembly Budget Sessions Monday Updates.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నట్లు నడిచింది. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్..అయన ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడతారు అని తలసాని అనడంతో.. నేను ఏం ఫీల్ కాను.. కానీ పేకాట అడే మంత్రి అయన అని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాజగోపాల్ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య హీట్ పెంచాయి. రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాలి… లేదంటే చర్యల తీసుకోవాలంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభలో ఎమ్మెల్యే లు…బయట వాళ్ల పీసీసీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు.
రాజగోపాల్ రెడ్డి పై చర్యలకు డిమాండ్ చేయడంతో ఇద్దరి వ్యాఖ్యలు రికార్డ్ నుండి తొలగించండి అని భట్టి కోరారు. క్షమాపణ చెప్పాలి అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ల సీట్ల వరకు బాల్క సుమన్, వివేక్..మెతుకు ఆనంద్ లు వెళ్లారు. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డ్ నుండి స్పీకర్ తొలగించారు. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శాంతించారు.
https://ntvtelugu.com/mekapati-goutham-reddy-portfolios-allotted-to-minister-buggana-rajendranath-reddy/
