TRSV Leaders Gun Fire In Jitta Ravinder Farm House Creates Ruckuss: ఇటీవల ఫ్రీడమ్ ర్యాలీలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్.. పోలీసులకు సంబంధించిన తుపాకీతో గాల్లో కాల్పులు చేసిన ఘటన ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే! ఆ వ్యవహారం ఇంకా చల్లారక ముందే మరో ఫైరింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. స్వాతంత్ర దినోత్సవం రోజు.. నగర శివారు ప్రాంతంలో రాచకొండ మిర్ఖంపేట్ గెస్ట్ హౌస్‌లో టీఆర్ఎస్వీ నాయకులు గన్‌తో గాల్లో కాల్పులు జరిపారు. టీఆర్ఎస్వీ మండల ప్రెసిడెట్ విగ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ కాల్పులు జరిపి.. ఆ దృశ్యాలను స్టేటస్‌గా పెట్టుకున్నారు. దీంతో అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఆ వీడియోలను చూసిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఎయిర్ గన్సా, లేక ఒరిజినల్ గన్సా అంటూ ట్రోల్ చేశారు. ఈ విషయం పోలీసుల దాకా చేరడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. గెస్ట్ హౌస్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆ నాయకులు కాల్పులు జరిపిన గన్‌న ఎయిర్ గన్‌గా గుర్తించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిట్టా రవీందర్ రెడ్డి ఫార్మ్ హౌస్‌లోనే కాల్పులు జరిగాయని పోలీసులు చెప్తున్నారు. పుట్టినరోజు వేడుకల జోష్‌లో టీఆర్ఎస్వీ నాయకులు ఈ కాల్పులు జరిపినట్టు తేల్చారు. ఈ వేడుకలకి బడా బాబులు కూడా హాజరయ్యారట! ఆ గన్ ఎయిర్ గన్ మోడల్ 35 అని, గెస్ట్ హౌస్ వద్ద ఎయిర్ రైఫిల్ పెల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
