Site icon NTV Telugu

CM KCR: 95 నుంచి 105 సీట్లు మావే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గురించి తనదైన రీతిలో కేసీఆర్ స్పందించారు. దేశంలో మార్పు కోసం పీకే తో కలసి పని చేస్తున్నాం. పీకే తో మాట్లాడుతున్నాం. నాకు 7 ఎనిమిది ఏళ్లుగా పీకేతో స్నేహం ఉందన్నారు. డబ్బుల కోసం పీకే ఎప్పుడు పని చేయరు. ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోం అన్నారు కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏం చేస్తామో అన్ని ఇప్పుడే చెబుతామా?ఇండియా గెట్ దగ్గర వరి ధాన్యం పోస్తాం అన్నారు సీఎం కేసీఆర్.

కేసీఆర్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పోతాడు. ఎట్ల పడితే అట్ల నోటిఫికేషన్లు ఇస్తారా ? జాతీయ స్థాయిలో ఫ్రంట్ ,వేదిక ఏదో నాకే తెలియదు …చర్చలు జరుగుతున్నాయన్నారు కేసీఆర్. చిన జీయర్ స్వామితో నాకు విబేధాలు ఉన్నాయి అని ఎవరు చెప్పారు ? అదంతా హాంబక్ అని కొట్టి పారేశారు సీఎం కేసీఆర్.

పంజాబ్‌ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని తీర్మానంచేశాం. ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వస్తుంది. రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం సేకరించాలి. రేపు మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారు అన్నారు సీఎం కేసీఆర్​. ఆహార ధాన్య సేకరణలో ‘ఒకే దేశం-ఒకే సేకరణ’ విధానం ఉండాలి. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం అనేక ఇబ్బందులు సృష్టించింది. తెలంగాణలో యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. కనీస మద్దతు ధర బియ్యానికి కాదు.. ధాన్యానికి నిర్ణయిస్తారని చెప్పారు కేసీఆర్.

Exit mobile version