KCR Special Flight: కేసీఆర్ దూకుడు.. జాతీయ పార్టీ..! సొంత విమానం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి.. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని సాధించారు కె.చంద్రశేఖర్ రావు.. ఆ తర్వాత ఉద్యమ పార్టీని.. రాజకీయ పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణలో రెండోసారి దిగ్విజయంగా తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్.. గత కొంత కాలంగా కేంద్ర విధానాలను ఎండగడుతూ.. జాతీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.. ఇక, ఈ మధ్య ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా.. జాతీయ పార్టీ పెడుతున్నా.. మీ మద్దతు కావాలి.. ఇస్తారా? నాతో వస్తారా? అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ వస్తున్నారు.. కొత్త పార్టీకి సమయం రానేవచ్చింది… దసరా రోజే జాతీయ పార్టీపై తీర్మానం, ప్రకటన ఉండబోతోందట.. అయితే, జాతీయ పార్టీ అధినేతగా కేసీఆర్.. దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది.. దీంతో, ఆయన పర్యటనలకు ఇబ్బందిలేకుండా.. ఓ ప్రత్యేక విమానం కొనుగోలు చేసేందుకు టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందట.. కొత్త విమానం కోసం దసరా రోజే ఆర్డర్ ఇచ్చే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది.
Read Also: RBI Monetary Policy: మళ్లీ వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ.. గృహ, వాహన రుణాలపై మరింత భారం..
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
ఈ ప్రత్యేక విమానం కోసం టీఆర్ఎస్ పార్టీ రూ. 80 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం.. 12 సీట్లతో కూడిన ఆ విమానం కొనుగోలుకు దసరారోజు ఆర్డర్ ఇవ్వాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.. ఈ నెల 5వ తేదీన కొత్త పార్టీపేరు ప్రకటించిన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వాలని గులాబీ పార్టీ బాస్ నిర్ణయానికి వచ్చారట.. ఇక, ప్రాంతీయ పార్టీ అయినా.. టీఆర్ఎస్ దగ్గర డబ్బులకు మాత్రం కొదవలేదు.. ఇప్పటికే ఆ పార్టీ ఖజానాలో రూ.865 కోట్ల వరకు ఉన్నాయి.. కానీ, పార్టీ కొనుగోలు చేయనున్న చిన్న విమానం కోసం విరాళాలు సేకరించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత.. తెలంగాణలో వరుస పర్యటనల కోసం హెలికాప్టర్‌ను వినియోగించారు కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతుండడంతో.. తమకు ఓ ప్రత్యేక విమానం ఉంటే.. దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం సులువు అవుతుందనే ఈ నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగుతోంది. విమానంలో 12 సీట్లు ఉండడంతో.. కేసీఆర్‌తో పాటు ఇతర కీలక నేతలు కూడా వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నమాట.. హెలికాప్టర్‌తో తెలంగాణలో చక్రం తిప్పిన గులాబీ బాస్.. ఇప్పుడు విమానంలో దేశ రాజకీయాల్లో కీలకంగా మారతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట పార్టీ శ్రేణులు. అయితే, 12 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ విమానం దాదాపు రూ. 80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నప్పటికీ, పార్టీ అధినేత మాత్రం 6 సీట్ల జెట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ప్రత్యేక అజెండాను రూపొందించుకుని, ఆ ఎజెండాను దేశమంతటా విస్తరించేందుకు సుడిగాలి పర్యటనకు వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..