Site icon NTV Telugu

TRS Samburalu: 6,7,8 తేదీలలో టీఆర్ఎస్ సంబురాలు

ఈనెల 6,7,8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ సంబురాలకు రెడీ అవుతోంది. 6వ తేదీన సంబురాలు ప్రారంభం అవుతాయి. కేసీఆర్ కి రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం వుంటుందని టీఆర్ఎస్ తెలిపింది.

కేసీసఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలయిన కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తారు. 8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబరాలు వుంటాయి. ఇతరులు భేటీ బచావో భేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్నది టీఆర్ఎస్ సర్కార్ అన్నారు మంత్రి కేటీఆర్.

https://ntvtelugu.com/minister-srinivas-goud-assassination-plan/
Exit mobile version