Site icon NTV Telugu

మళ్లీ రసమయికే అవకాశం ఇచ్చిన కేసీఆర్..

Rasamayi Balakishan

Rasamayi Balakishan

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మరోసారి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కే అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయికి సమున్నత గౌరవం కలిపించింది ప్రభుత్వం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌.. దానికి ఛైర్మన్‌గా రసమయిని నియమించారు.. అయితే, ఆయన పదవి కాలం ముగిసిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఖాళీగా ఉంది సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ పదవి.. అయితే, మరోసారి రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. సీఎం కేసీఆర్‌ను కలిసిన రసమయి.. మరోసారి తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు..

Exit mobile version