BRS leaders met the CEC: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై ఎన్నికల సంఘానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసిన విషయంత తెలిసిందే.. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మారుస్తూ నిన్న టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అయితే.. ఈ విషయాన్నే వివరిస్తూ ఈసీకి కేసీఆర్ లేఖ రాశారు. కాగా.. ఈతీర్మానాన్ని ఆపార్టీ సీనియర్ నేత బి.వినోద్ కుమార్ బృందం ఢిల్లీకి వెళ్లి బీఆర్‌ఎస్ పేరు తీర్మానాన్ని సీఈసీకి అందజేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ నేతలకు ఈసీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో.. ఇవాళ ఈ తీర్మానాన్ని సమర్పించి, దానికి ఆమోదం తెలపాల్సిందిగా కోరింది. ఈనేపథ్యంలో.. బీఆర్ఎస్ లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో దాని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని ఆపార్టీ కోరింది.
Read also: Anasuya Bharadwaj: అందుకే ‘గాడ్‌ఫాదర్’కి దూరంగా ఉన్నా
అయితే.. మొదట రైతుల నేతలతో కలిసి కిసాన్ సంఘ్ ఏర్పాటు చేసి, తెలంగాణ మోడల్ ను ఆయా రాష్ట్రాల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు వివరించనున్నాయి. కాగా.. ముఖ్యంగా తెలంగాణలో అమలువుతున్న రైతుబంధు.. రైతు బీమా.. 24 గంటల విద్యుత్.. మిషన్ భగీరథ.. కల్యాణ లక్ష్మి.. షాదీముబారక్.. కేసీఆర్ కిట్లు,, తాజాగా ప్రవేశపెట్టిన దళితబంధుపైనే బీఆర్ఎస్ ఆధారపడనుంది. అయితే.. 2018 నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇక, దేశాన్ని ఇన్నాళ్లు పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీల తీరును ఎండగడుతున్నారు. ఇక..ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు.
Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీలో ఉన్న భారతీయులు వీరే..
