Site icon NTV Telugu

షర్మిల పార్టీలో చేరడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్లారిటీ

షర్మిల పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య ఖండించాడు. వైఎస్సార్ అంటే తనకు అభిమానమని.. తెలంగాణ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డినా..? తెలంగాణనా అంటే..? తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజయ్య తెలిపారు. నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా.. సోషల్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు రాశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారు. గతంలో ఓ క్రైస్తవ సమావేశం సందర్భంగా కలిసిన ఫోటోను వైరల్ చేశారని తెలిపారు. నాకు ఇష్టమైన వైద్య ఆరోగ్య శాఖను, డిప్యూటీ సీఎం హోదా కేసీఆర్ నాకు కల్పించారు. నేను రాజకీయ ఓనమాలు దిద్దింది కాంగ్రెస్ పార్టీ అయితే ఎదుగుదల మాత్రం టీఆర్ఎస్ వల్లే.. నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అంటూ టి. రాజయ్య క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version