NTV Telugu Site icon

Trs Fight: రచ్చకెక్కిన గులాబీనేతల వర్గపోరు

Trs New

Trs New

తెలంగాణలో ఒక్క జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు ఎక్కువగా వుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తార స్థాయికి చేరింది. ఏకంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై దాడికి స్వపక్షీయులే దాడి చేయడానికి ప్రయత్నించారు. మోటార్ బైక్ ను డీ కొట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి కోసం ఎదురు చూసిన చైర్ పర్సన్ ఏకంగా రోడ్డెక్కి బైఠాయించింది. దీంతో కొత్తగూడెంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పుడు అంతా టీఆర్ఎస్ పార్టీ వర్గాలమయంగా తయారైంది. అక్కడ రోజుకో వివాదం కొనసాగుతుంది. మొన్నటి వరకు రాఘవ కేసు వ్యవహారంతో ఇక్కడ చర్చనీయాంశంగా మారగా, నిన్నటి వరకు హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు దేవతగా చెప్పుకుంటున్న ఎంపీపీ విజయ లక్ష్మి ఇంటిలో పూజలకు వచ్చి బుక్కయ్యాడు. అది మాసి పోకముందే టీఆర్ఎస్ లోని వర్గాలు తమ విబేధాలను బట్ట బయలు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ లో చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా తెలంగాణ వ్యాపితంగా నల్ల జెండాలను ఎగుర వేసే కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. ఈసందర్బంగా కొత్తగూడెంలో బైక్ ర్యాలీని ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వరరావు చేపట్టారు.

బైక్ ర్యాలీలో వనమాతో పాటుగా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మి కూడా పాల్గొన్నారు. అదే సందర్బంగా పలువురు మహిళా కౌన్సిలర్ లు కూడా తమ భర్తలతో వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ చేస్తుండగా సీతామహాలక్ష్మి బైక్ ను డీ కొట్టేందుకు కొంత మంది కౌన్సిలర్ ల భర్తలు ప్రయత్నించారు. ఇక్కడ గూడెం మున్సిపాలిటీ కౌన్సిల్ లో టీఆర్ఎస్ కౌన్సిలర్ లు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. గత కొంత కాలం క్రితం చైర్ పర్సన్ కే ప్రోటో కాల్ కూడా పాటించకుండా కొంతమంది టీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన పరిస్థితి కూడా ఉండేది. తాజాగా జరిగిన ఘటనలో కూడా పలువురు కౌన్సిలర్ ల భర్తలు అనుసరించిన వైఖరిపై మహాలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంపై ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెను పరామర్శించేందుకు ఎంఎల్ఎ వనమా ఇంటికి వెళ్లారు. దాదాపుగా నాలుగు గంటల పాటు ఇంటిలోనే వనమా ఉండిపోయాడు.

అయితే ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ నేతలు యూసప్, మొర్రె భాస్కర్ రావుల పై ఫిర్యాదు చేసింది. అయితే రేగా కొత్తగూడెంకు వస్తున్నానంటూ నాలుగు గంటల పాటు తాత్సారం చేశాడు. దీంతో కాపు సీతామహాలక్ష్మీ కూడ తనకు జరిగిన అవమానంపై, తనపై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలను తీసుకోవాలని రోడ్డు మీద బైఠాయించింది. దీంతో కొత్తగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు నిలుపుదల చేయించాడు. తాను వచ్చి మాట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు. వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ వ్యవహారం తరువాత కొత్తగూడెంలో టీఆర్ఎస్ చుక్కాని లేని నావ మాదిరిగా తయారు అయ్యింది. పార్టీ నాయకత్వం కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శ ఉంది.

Bandi Sanjay : రండి కదలండి అంటూ.. రైతులకు బహిరంగ లేఖ..