Site icon NTV Telugu

Tragedy in Sangareddy: సంగారెడ్డిలో విషాదం.. ఉరేసుకుని ముగ్గురి ఆత్మహత్య

Tragedy In Sangareddy

Tragedy In Sangareddy

సమాం ఎటుపోతుంది. ఎవరికి వారులా తయారవుతుంది. ఒకప్పుడు వివాహంలో అడిగుపెట్టే వారికి అన్యోన్య జీవితం. వారి కుటుంబంలో కలతలు, గొడవలు వున్నా కుటుంబ సభ్యులంటే ప్రాణం, మరిది అంటే కొడుకుతో సమానం, వదినంటే అమ్మతో సమానం, అత్తమామలంటే తల్లిదండ్రులతో సమానం. ఇలాంటి వాటికి ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. వాలి పదాలు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. క్షణిక సుఖం కోసం అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హత్యలకు, మోసాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

వివారాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన రేఖ, తన నాలుగేళ్ల చిన్నారి, మరిది బాసువ్దే కుష్బా తో కలిసి బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. భానూరులో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ.. బుధవారం వీరు చిన్నారితో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. అక్కడున్న స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధం కారణమని, పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను ఆరా తీస్తున్నారు.

read also: Ayyannapatrudu: ఎన్టీఆర్ కుమార్తె మరణంపై శవ రాజకీయమా?

అయితే కర్ణాటకలోని నాగమంగల తాలూకా కెంచెగౌడనకొప్పలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రేమించుకుని, పెద్దల్ని ఎదురించి మరీ పెళ్లిచేసుకున్నారు. కొద్దిరోజులు సాఫీగానే జరిగిన కాపురంలో కలతలు.. కలహాలు మొదలయ్యాయి. దానికిగల కారణం భార్య ఆరాతీయగా.. ఆ భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది. వీటన్నింటినీ దాటుకుని కాపురం నిలబడుతుందని ఆమె ఆశగా ఎదురుచూసింది.. జీవితాంతం నువ్వే తోడూ, నీడా అని తల్లిదండ్రుల్ని కూడా ఎదురించి ఎవరికోసమమైతే వచ్చేసిందో.. ఎవర్నైతే ప్రాణాధికంగా ప్రేమించిందో అతనే వేరే మహిళతో వివాహేతర సంబంధ వుండటంతో భరించని ఆభార్య తను చనిపోతే కొడుకు ఏమైపోతాడో అనుకుందో ఏమో తన చిన్న కొడుకును చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈదారుణం అందరిని కలిచి వేసింది.
Bank Robbery: బ్యాంకులో దోపిడీ.. అలా వచ్చి రూ.35 లక్షలతో ఉడాయించిన బాలుడు..!

Exit mobile version