Site icon NTV Telugu

Traffic Restrictions: నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Traffic Restrictions

Traffic Restrictions

Traffic Restrictions: సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో బీజేపీ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ సమావేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. దీనికి ప్రజలు సహకరించాలని పోలీసులు సూచించారు. వాహనదారులు వేరే ప్రాంతాల నుంచి వెళ్లాలని తెలిపారు. ఇబ్బంది పడకుండా సరైన దారుల్లో వెళ్లాలని.. పోలీసులకు సహకరించాలని కోరారు. షా పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లండించారు. ప్రజలు ప్రత్యేక ప్రత్నామ్నాయ దారులుగుండా వెళ్లాలని తెలిపారు. ఇంపీరియల్ గార్డెన్స్‌, పరేడ్ గ్రౌండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని పేర్కొన్నారు.

Read also: Congress : కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 62 సీట్లపై చర్చ, నేడు రెండో జాబితా విడుదల!

అమిత్ షా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నందున ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఇతర నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రాష్ట్ర నేతలతో షా భేటీ కానున్నారు. సదస్సు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.
KCR: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభ.. కలిసొచ్చిన గడ్డ నుంచే శంఖారావం..!

Exit mobile version