NTV Telugu Site icon

ప్ర‌తి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు… ఎందుకంటే…

రాత్రి స‌మ‌యంలో ట్యాంక్‌బండ్ అందాల‌ను వీక్షించేందుకు వంద‌ల సంఖ్య‌లో న‌గ‌ర‌వాసులు అక్క‌డికి వ‌స్తుంటారు.  ఒక‌వైపు ప‌ర్యాట‌కుల‌తో పాటు, ట్రాఫిక్ ర‌ద్ధీకూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది.  ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ రద్ధీ అధికం.  దీంతో ట్యాంక్‌బండ్‌పై ఆంక్ష‌లు విధించేందుకు ప్ర‌భుత్వం సిద్ధం అయింది.  ప్ర‌తి ఆదివారం రోజున సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ను డైవ‌ర్ట్ చేయాల‌ని హైద‌రాబాద్ సీపీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.  న‌గ‌ర‌వాసుల ట్యాంక్‌బండ్ సంద‌ర్శ‌న‌కు అనుకూలంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉండ‌బోతున్నాయి.  ఆదివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి ట్రాఫిక్ లేకుంటే మ‌రింత ఎక్కువ‌మంది న‌గ‌ర‌వాసులు ఆ ప్రాంతానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.  

Read: మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్