NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్‌లో ఆ వాహ‌నాల‌కు ఇక‌పై నో ఎంట్రీ…

హైద‌రాబాద్ లో ఓలా, ఉబెర్ వాహ‌నాలు పెద్ద సంఖ్య‌లో న‌డుస్తున్నాయి. న‌గ‌రంలో ఎన్ని కొత్త ర‌వాణా యాప్‌లు వ‌చ్చినా ఆద‌ర‌ణ ల‌భిస్తున్న‌ది. న‌గ‌రంలో ఉన్న వాహ‌నాలు స‌రిపోక‌పోవ‌డంతో ఇత‌ర ప్రాంతాల‌న నుంచి కూడా వాహ‌నాలు న‌గ‌రంలోకి వ‌స్తున్నాయి. ఉబెర్‌, ఓలా యాప్‌ల‌కు అనుబంధంగా ప‌నిచేస్తున్నాయి. అయితే, న‌గ‌రంలో రిజిస్ట‌ర్ చేసుకున్న వాహ‌నాల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా వ‌స్తున్న వాహానాల‌ను కూడా వినియోగించుకుంటుండ‌టంతో ఆటోవాలాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

Read: Electric Bicycle: అతి త‌క్కువ ఖ‌ర్చుతో… ఆనంద్ మ‌హీంద్రా సైతం…

జంట‌న‌గ‌రాల్లో తిరిగే ఓలా, ఉబెర్ అటోలు హైద‌రాబాద్ రిజిస్ట్రేష‌న్ టీఎస్ 09 నుంచి టీఎస్ 13 సీరిస్ వ‌ర‌కు ఉన్న వాటికే అనుమ‌తులు ఇవ్వాల‌ని, ఇత‌ర ప్రాంతాల్లో రిజిస్ట్రేష‌న్ చేసిన వాహ‌నాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌కూడ‌ద‌ని, ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వాహ‌నాలు న‌గ‌రంలో ఉబెర్‌, ఓలా యాప్‌ల‌కు అనుబంధంగా ప‌నిచేస్తే వాటికి భారీ జ‌రిమానా విధిస్తామ‌ని పోలీసులు పేర్కొన్నారు.