NTV Telugu Site icon

Traffic Diversions: కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. 3 రోజులు అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Diversions

Traffic Diversions

Traffic Diversions: హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ అలర్ట్‌ ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్-2004 సందర్భంగా నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. సుమారు మూడు రోజులపాటు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. నేటి నుంచి 15వరకు పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. దీంతో వాహనదాలు దీనిని గమనించాలని అన్నారు. వాహనాలు ఆ రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా తివోలి క్రాస్‌ రోడ్డు నుంచి ప్లాజా ఎక్స్‌ రోడ్డు వరకు రోడ్డును పూర్తిగా మూసేయనున్నట్టు వెల్లడించారు. ఆంక్షలు అమల్లో ఉన్న రూట్లలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ను మళ్లిస్తున్నట్లు తెలిపారు.

Read also: Taiwan: తైవాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా దాడులు..

ఆంక్షలు ఉండే మార్గాలు..

అలుగడ్డబావి ఎక్స్‌ రోడ్స్‌, సంగీత, వైఎంసీఏ జంక్షన్లు, ప్యాట్నీ, ఎస్‌బీహెచ్‌, ప్లాజా, సీటీవో, బ్రూక్‌ బాండ్‌, తివోలి, స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్స్, సికింద్రాబాద్‌ క్లబ్‌, తాడ్‌ బంద్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, బోయిన్‌పల్లి ఎక్స్‌ రోడ్స్‌, రసూల్‌పురా, బేగంపేట్‌, పారడైజ్‌ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సీపీ విశ్వ ప్రసాద్‌ తెలిపారు. కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ను తిలకించేందుకు వచ్చే నగరవాసులు సొంత వాహనాలకు బదులు.. మెట్రో రైలుసర్వీస్‌ లను ఉపయోగించుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌ కు వచ్చే వారికి కేటాయించిన పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలను పార్క్‌ చేయాలని సీపీ విశ్వప్రసాద్‌ వెల్లడించారు. నగర ప్రజలు సహకరించాలని, రూట్లు మళ్లింపు గమనించి వేరే మార్గాల ద్వారా గమ్యస్థానానికి సాఫీగా చేరుకోవాలని కోరారు.
US Army Helicopter Crashes: అమెరికాలో కూలిన ఆర్మీ హెలికాప్టర్