NTV Telugu Site icon

India vs England Match: 29 వరకు ఆ రూట్లో వెళ్లకండి.. వెళ్లారో బుక్కైనట్టే

Uppal Trafic

Uppal Trafic

India vs England Match: హైదరాబాద్ వాసులకు పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో.. ఆయా రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలివచ్చే అవకాశం ఉంది. ఉదయం ఆరున్నర గంటలకు ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తారు. అయితే ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్‌సీఏ, పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ బలగాలతో పాటు మొత్తం 1500 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. దీంతోపాటు మఫ్టీలో మహిళా పోలీసులను ఏర్పాటు చేసారు. అదే క్రమంలో పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన రహదారి కావడంతో ఉప్పల్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులు, స్టేడియంకు వెళ్లే మార్గాల్లో వాహనాలను మళ్లిస్తారు. ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణకు 250 మంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

Read also: Google: ఇజ్రాయెల్, పాలస్తీనాలోని ఏఐ స్టార్టప్‎ల్లో గూగుల్ 8మిలియన్ డాలర్ల పెట్టుబడులు

కార్లు, బైక్‌లు పార్కింగ్ చేయడానికి మొత్తం 15 స్థలాలను అందుబాటులో ఉంచారు. ఉప్పల్ X రోడ్స్, స్ట్రీట్ నెం.8 జంక్షన్, హబ్సిగూడ జంక్షన్, ఏక్ మినార్ మసీదుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలను సూచించడానికి రోడ్ల వెంట మాస్టర్ డైరెక్షనల్ బోర్డులు, లొకేషన్ మ్యాప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఉప్పల్ స్టేడియంకు వెళ్లే మార్గాల్లో మళ్లింపులను సూచించేందుకు దిశ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. టెస్ట్ మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. కొన్ని కేటగిరీల భారీ వాహనాలను ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దారి మళ్లిస్తామని తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. కాగా, రేపటి (జనవరి 25) నుంచి ఈ నెల 29 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరగనుంది. గురువారం ఉదయం 9.30 గంటలకు తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని.. స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌!