NTV Telugu Site icon

Traffic diversion at Balanagar: హైదరాబాద్‌ వాసులు అలర్ట్‌.. 3 నెలల పాటు అక్కడ ట్రాఫిక్ మళ్లింపు

Traffic Diversion At Balanagar

Traffic Diversion At Balanagar

Traffic diversion at Balanagar: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 మంగళవారం నుంచి జూలై 28 వరకు సుమారు 3 నెలలపాలు ట్రాఫిక్‌ మళ్లించనున్నాట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ సమీపంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక మెట్రో స్టేషన్ వద్ద AG కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈపనుల నిమిత్తం దాదాపు మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవాల్టి నుంచి (మార్చి 28)వ తేదీ నుంచి జులై 28వ తేదీ వరకు అనగా 3నెలలు అంటే 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అయితే.. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు… ప్రయానికులు ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సహకరించాలని వాహనదారులను కోరారు.

1. కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ యూ-టర్న్‌.. ఐడీఎల్‌ లేక్‌ రోడ్‌, గ్రీన్‌హిల్స్‌ రోడ్‌, రెయిన్‌బో విస్టాస్‌, ఖైత్లాపూర్‌ ఫ్లైఓవర్‌, పర్వత్‌ నగర్‌, తోడి కాంపౌండ్‌ వైపు మళ్లించనున్నారు.

2. కూకట్‌పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయినపల్లి జంక్షన్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లైఓవర్ వద్ద మళ్లిస్తారు.

3. బాలానగర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లై ఓవర్ కింద న్యూ బోయినపల్లి జంక్షన్, తాడ్‌బండ్ రైట్ టర్న్, ప్యారడైస్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ వైపు మళ్లించనున్నారు.

4. మూసాపేట్, గూడ్‌షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఐడిఎల్ లేక్ రోడ్, గ్రీన్‌హిల్స్ రోడ్, రెయిన్ బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, పార్వత్ నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్ వైపు మళ్లిస్తారని సూచించారు.

వాహనదారులు దీనిని గమనించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రాయాణాలు కొనసాగించాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా వీటిని దృష్టిలో పెట్టుకోని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
SSMB 28: పైడి, పూడి, పెట్ల కాదు అక్కడ ఉన్నది గురూజీ…

Show comments