Site icon NTV Telugu

Jaggareddy: జగ్గారెడ్డి బాధ్యతల్లో కోత

టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చెక్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల్లో కోత విధించింది. ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. ఆయనకు గతంలో ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

జగ్గారెడ్డి కి అప్పగించిన బాధ్యతల్లో… అంజన్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ లకు అప్పగించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మహిళా కాంగ్రెస్, ఫిషర్ మెన్ విభాగం మహేష్ గౌడ్ కి అప్పగించారు. అలాగే, భువనగిరి, ఖమ్మం, వరంగల్ బాధ్యతలు అంజన్ కుమార్ యాదవ్ కి, కరీంనగర్ పార్లమెంట్ బాధ్యతలు మహేష్ గౌడ్ కి అప్పగించింది టీపీసీసీ.

Exit mobile version