Mallu Ravi: కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిలర్ అని కోమటిరెడ్డి మాట్లాడితే మా కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నోరు జారి ఇష్టమున్నట్టు మాట్లాడితే నాలుక చీరుస్తాం జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Waltair Veerayya: బాస్ ఈజ్ బ్యాక్
కాంగ్రెస్ పెట్టిన రాజకీయ బిక్షతో పదవులు పొంది ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా, ఎంపీ గా గెలిచిన రాజగోపాల్ రెడ్డి, డబ్బులకు కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని వ్యాఖ్యలనించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు లు పొంది వేల కోట్లు సంపాదించిన రాజగోపాల్ రెడ్డి నేడు పదవులు, సంపద ఇచ్చిన కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కుట్ర చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమే అవుతుందని మండిపడ్డారు. బీజేపీ లో చేరిన రాజగోపాల్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తూ ఇతర పార్టీల నాయకలుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పిచ్చి మాటలు మనకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మల్లురవి హెచ్చరించారు.
Kabul Fuel Tanker Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోరం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి, 19 మంది దుర్మరణం
