Site icon NTV Telugu

Tomato Price: కొనసాగుతున్న టమాటా మోత.. రూ.250కు చేరుకునే అవకాశం

Tomato

Tomato

Tomato Price: హైదరాబాద్‌లో టమాటా ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో టమాటా ధరలు కిలో రూ.200కి చేరగా, వారం రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడి రూ.140కి లభించాయి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వారం ముగిసేలోపే టమాటా ధరలు రూ.200లకు చేరడంతో కొనుగోలుదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరో వారం రోజుల్లో రూ.250కి చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి టమోటాలు వస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ వ్యాపారులకు మహారాష్ట్ర నుంచి టమోటాలు వస్తుంటాయి. అక్కడ కూడా వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గిపోయి పంజాబ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం వల్ల రవాణా ఖర్చులు కూడా భారమవుతున్నాయి. దీంతో వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ వాసులు కొనుగోలు చేయడం లేదని, ఇతర కూరగాయలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also: Adilabad: జిల్లాలో కళ్ళ కలక కలకలం.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న భాదితులు..

టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది ఇంట్లో టమాట వాడటం మానేశారు. ఇకపై రెస్టారెంట్లలో టమోటాలు ఉపయోగించరు. అమ్మకాలు తగ్గిపోవడంతో నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు కిలో రూ.2కు లభించే టమాటా కొనాలంటేనే వినియోగదారులు భయపడుతున్నారు. కొంత మంది అరకాగి, పప్పుకాగి కొనుగోలు చేస్తుండగా.. మరికొంత మంది పూర్తిగా కొనడం మానేశారు. టమాటా ధరల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ధరల పెంపుపై మార్కెటింగ్ శాఖ దృష్టి సారించడం లేదు. దీంతో వ్యాపారులు సైతం తమకు నచ్చిన రేటుకు టమాట విక్రయిస్తున్నారు. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో టమాట ధరలు అదుపులోకి వస్తాయని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఉత్తరాదితోపాటు దక్షిణాదిలోనూ వర్షాలు కురిశాయి. కుంభ వర్షాలతో పంటలకు మరింత నష్టం వాటిల్లడంతో ధరల పెరుగుదల ఆగడం లేదు. చికెన్ ధరలతో టమాట పోటీ పడుతోంది. చికెన్ కంటే టమాటా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
Gangs of Godavari: విశ్వక్ సేన్ తదుపరి చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్ ఖరారు

Exit mobile version