నీటిపారుదల రంగ నిపుణుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు జయంతిని పురస్కరించుకుని నేడు తెలంగాణ ఇంజినీర్స్ డేను నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరు కానున్నారు.
Read Also: ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో అరుదైన రికార్డు
తొలుత జలసౌధలో విశ్రాంత ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్‌రావు విగ్రహానికి పలువురు అధికారులు నివాళులర్పిస్తారు. అనంతరం సాగునీటి రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఇంజినీర్లకు మంత్రి అవార్డులు అందజేస్తారు. తెలంగాణ ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ ఏడాది నీటిపారుదల శాఖకు చెందిన ముగ్గురిని ఉత్తమ బహుమతి కింద ఎంపిక చేశారు. జగిత్యాల సీఈ కె.సుధాకర్‌రెడ్డి, అంతర్ రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్‌ఈ ఆర్.కోటేశ్వరరావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీఈఈ ఎం.నీలిమ ఉత్తమ ఇంజినీర్లు కింద బహుమతులు అందుకోనున్నారు.