NTV Telugu Site icon

Bharat Jodo Yatra: నేడు రాష్ట్రంలోకి ఎంటర్‌ కానున్న రాహుల్‌ యాత్ర..

Rahul Gandhi

Rahul Gandhi

Bharat Jodo Yatra: ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర నేడు తెలంగాణ లోకి ప్రవేశించనుంది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర సాగనుంది. నేడు దాదాపు 13 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర చేయనున్నారు. కృష్ణ నది ‌బ్రిడ్జి‌ మీద రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలకనున్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీకి జాతీయ పతాకాన్నిటీ కాంగ్రెస్‌ నేతలు అందించనున్నారు. కృష్ణా నది‌బ్రిడ్జి‌నుండి తెలంగాణలో మూడు కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర సాగనుంది.

Read also: Apple Watch: చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగో తెలుసా?

ఈ నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మక్తల్ చేరుకుంటున్నారు. నేడు మరిక్కల్ వద్ద ప్రసంగించాక ఢిల్లీకి రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. మక్తల్ నుండి హైదరాబాద్ కి హెలికాప్టర్ లో ప్రయాణం.. అక్కడ నుండి‌ ఢిల్లీ కి రాహుల్ వెళ్లనున్నారు. దీపావళి పండుగ కోసం మూడు రోజులు జోడో యాత్ర కు బ్రేక్ ఇవ్వనున్నారు. ఈ నెల 27 ఉదయం 6 గంటల నుండి మళ్లీ మక్తల్ నుండి జోడో యాత్ర ఆరంభం కానుంది. నవంబర్ 8 వరకు తెలంగాణలో జోడో యాత్ర నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో ఒకరోజు నైట్‌ హాల్ట్‌ చేయనుండగా నెక్లెస్‌ రోడ్‌లో కార్నర్‌ మీటింగ్‌ లో రాహుల్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక.. రాహుల్‌ పాదయాత్ర ప్రధానంగా యువత, రైతులు, మహిళలే లక్ష్యంగా సాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని.. పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చి భరోసాను కల్పిస్తారని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో.. పాలమూరు విశ్వవిద్యాలయ విద్యార్థులతో రాహుల్‌ భేటీ అయ్యేలా చూడాలన్న ఆలోచన కూడా నాయకుల్లో ఉంది. ఇక, మహిళల సమస్యలనూ యాత్రలో ప్రస్తావిస్తారని నేతలు చెబుతున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు కూడా రాహుల్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాసేపట్లొకి తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర l NTV