NTV Telugu Site icon

Bathukamma Day3: నేడు ముద్దపప్పు బతుకమ్మ.. ఏం చేస్తారంటే!!

Muddapappu Batukamma

Muddapappu Batukamma

Bathukamma Day3: మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. ​​ఆడబిడ్డల ఆత్మీయ వేడుక బతుకమ్మ. బుధవారం (అక్టోబర్ 2) నుంచి అక్టోబర్ 10న అంటే తొమ్మిది రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. రెండు రోజులు ఎంగిలి పూల బతుకమ్మను జరుపుకున్న మహిళలు నిన్న రెండో రోజు అటుకుల బతుకమ్మను వేడుకగా జరుపుకున్నారు. ఇవాళ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. ఈ రోజున, ముద్ద పప్పు, పాలు, బెల్లంతో చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రేపు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేప బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తారు. ఇలా బతుకమ్మను తంగేడు పూలు, గునుగు పువ్వులు, కట్ల పువ్వులు, బంతి, మల్లె, చామంతి, సంపెంగ, గులాబీ, రుద్రాక్షలు, సీత జడలు వంటి రకరకాల పూలతో అలంకరించి ప్రతిరోజు తొమ్మిది రోజుల పండుగను జరుపుకుంటారు. బతుకమ్మలో భాగంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజల జీవన సౌందర్యాన్ని జానపద పాటల ద్వారా తెలియజేసేందుకు ఊరూరా ప్రయత్నిస్తోంది. ప్రతిరోజు అమ్మవారిని వివిధ నైవేద్యాలతో పూజిస్తారు. చివరి రోజు ఆడబిడ్డలు ఆడిపాడి పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ.. మళ్లొచ్చే ఏడాది తిరిగి రావమ్మ.. అని వీడ్కోలు పలుకుతారు. నీళ్లలో నిమజ్జనం చేసి వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు.
Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!

Show comments