Bathukamma Day3: నేడు ముద్దపప్పు బతుకమ్మ.. ఏం చేస్తారంటే!!
- తెలంగాణలో కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు..
- మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma Day3: మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక బతుకమ్మ. బుధవారం (అక్టోబర్ 2) నుంచి అక్టోబర్ 10న అంటే తొమ్మిది రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. రెండు రోజులు ఎంగిలి పూల బతుకమ్మను జరుపుకున్న మహిళలు నిన్న రెండో రోజు అటుకుల బతుకమ్మను వేడుకగా జరుపుకున్నారు. ఇవాళ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. ఈ రోజున, ముద్ద పప్పు, పాలు, బెల్లంతో చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రేపు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేప బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తారు. ఇలా బతుకమ్మను తంగేడు పూలు, గునుగు పువ్వులు, కట్ల పువ్వులు, బంతి, మల్లె, చామంతి, సంపెంగ, గులాబీ, రుద్రాక్షలు, సీత జడలు వంటి రకరకాల పూలతో అలంకరించి ప్రతిరోజు తొమ్మిది రోజుల పండుగను జరుపుకుంటారు. బతుకమ్మలో భాగంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజల జీవన సౌందర్యాన్ని జానపద పాటల ద్వారా తెలియజేసేందుకు ఊరూరా ప్రయత్నిస్తోంది. ప్రతిరోజు అమ్మవారిని వివిధ నైవేద్యాలతో పూజిస్తారు. చివరి రోజు ఆడబిడ్డలు ఆడిపాడి పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ.. మళ్లొచ్చే ఏడాది తిరిగి రావమ్మ.. అని వీడ్కోలు పలుకుతారు. నీళ్లలో నిమజ్జనం చేసి వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు.
Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!