CM Revanth Reddy: నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీసీకుంట మండలంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధుసూదన్ రెడ్డికి పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఆ తర్వాత 2.45 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ గా మహేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ఇందిరాభవన్ ఎదుట బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పీసీసీ చీఫ్‌గా ప్రమాణస్వీకారం సందర్భంగా గాంధీభవన్‌ను ముస్తాబు చేశారు. బాధ్యతల అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. పూజల అనంతరం గాంధీభవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలో యాభై నుంచి అరవై మంది వరకు కూర్చోవచ్చు.వేదికపై 500 మంది వరకు ముఖ్యనేతలు కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also: Flood Flow Reduced: ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద..
అన్ని రంగులు వేయించి, కొత్త ఫర్నిచర్ వేయించి గాంధీభవన్‌ను ఏర్పాటు చేశారు. గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. శనివారం మధ్యాహ్నం సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గాంధీభవన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని గుర్తు చేశారు. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో దాదాపు రెండు గంటలపాటు బస చేయనున్న నేపథ్యంలో పోలీసులు శనివారం సాయంత్రం నుంచి దాని పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.