Site icon NTV Telugu

తెలంగాణలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,085 శాంపిల్స్‌ పరీక్షించగా… 205 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 185 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,77,546కు చేరుకోగా… రికవరీ కేసులు 6,69,673కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,002కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,871 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. తాజా, కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కొత్త కేసులు వెలుగు చూశాయి అని బులెటిన్‌ లో పేర్కొంది ప్రభుత్వం.

Exit mobile version