Site icon NTV Telugu

తెలంగాణ కరోనా అప్డేట్…

తెలంగాణ కరోనా పాజిటివ్‌ కేసులు గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 26,842 శాంపిల్స్‌ పరీక్షించగా… 135 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కోవిడ్‌ బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 168 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,70,274కు పెరగగా.. రికవరీ కేసులు.. 6,62,377కు చేరాయి.. ఇక, మృతుల సంఖ్య 3,947కు పెరిగింది.. ప్రస్తుతం 3,950 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు సర్కార్‌ వెల్లడించింది.

Exit mobile version