NTV Telugu Site icon

Telangana Rains: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Telangana Rains

Telangana Rains

Telangana Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. రుతుపవనాలు ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు, రేపు (బుధ, గురువారా)ల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Read also: Singareni: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు

కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురుస్తుంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
TG TET 2024 Results: బిగ్‌ అలర్ట్.. నేడు టెట్ ఫలితాలు విడుదల..

Show comments