Site icon NTV Telugu

Gold Scam: తక్కువ ధరకే బంగారం అంటూ 4 కోట్లు కాజేసి పరార్..

Gold Scam

Gold Scam

Gold Scam: బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? అందునా.. తక్కువ ధరకే ఇస్తామంటే, జనాలు ఇంకా ఎగబడతారు. ఇప్పుడున్న డిమాండింగ్ రోజుల్లో తక్కువ మొత్తానికే బంగారం సొంతం చేసుకుంటే, లాభం పొందవచ్చన్న ఉద్దేశంతో ముందుకొస్తారు. మరికొందరైతే అప్పు చేసి మరీ గోల్డ్‌ కొంటారు. ఈ బలహీనతనే పసిగట్టి.. ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడింది. తక్కువ మొత్తానికే బంగారం ఇస్తామని ఊరించి.. పలువురి నుంచి రూ. 4 కోట్లు వసూలు చేసిన ముగ్గురు స్నేహితులపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. విశాల్‌, వినయ్‌, అఖిల్‌ ముగ్గురు స్నేహితులు కలిసి తక్కువ ధరకు బంగారం ఇప్సిప్తామంటూ గోల్డ్‌స్కీమ్‌ ఏర్పాటు చేశారు.

Read also: Rajasthan: బైక్‌పై రొమాన్స్.. స్టేషన్ తీసుకెళ్లి ఆ పని చేయించిన పోలీసులు

కాగా.. ఇందులో రూ. 50 వేలతో చేరితో బంగారం మార్కెట్‌ రేట్‌ కన్నా 10 శాతం తక్కువకు వస్తుందంటూ డిపాజిట్లు సేకరించారు. అనంతరం దీనిని చైన్‌ సిస్టమ్‌లా మార్చేశారు. మొదటి గోల్డ్‌స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లకు లాభం వచ్చిందంటూ నమ్మిస్తూ కొంత డబ్బులు తిరిగి ఇస్తూ నమ్మకం కుదుర్చుకున్నారు. కాగా.. దీంతో చాల మంది స్కీమ్‌లో చేరగా రూ. 4 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. ఇక రామంతాపూర్‌కు చెందిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Prashanth Neel : ఆ హీరో ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న ప్రశాంత్ నీల్..?

Exit mobile version