Fatal Road Accident: దేశంలోని రహదారులు నిత్యం రక్తమోడుతూనే ఉన్నాయి. వాహనం అదుపు తప్పడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చిన్నపాటి అలసత్వం ఏం కాదులే అనేంతగా అజాగ్రత్త కూడా ప్రాణాలను బలిగొంటుందని చాలా నివేదికలు పేర్కొన్నాయి. అయినా ఈ ప్రమాదాలు ఆగడం లేదు. నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందడం విషాదం నెలకొంది.
Read also: Road Accident: పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం
నల్లగొండ జిల్లా హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18) వీరంతా ఖమ్మం వాసులుగా గుర్తించారు. హైదరాబాదు నుండి ఖమ్మం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదులో వలీమా ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళుతుండగా తెల్లవారుజామున డివైడర్ ను ఢీకొట్టడంతో ఇన్నోవా కారు ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు యువకులు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ప్రమాదానికి డివైడర్ ను ఢీ కొట్టడం వల్లే జరిగిందా? లేక మద్యం మత్తులో స్పీడ్ గా నడిపి ఈఘటన దారితీసిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఓవివాహ విందుకు వెళ్లి ఆనందంతో తిరుగు ప్రయాణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Ekalavya Model School: ప్రిన్సిపల్, వార్డెన్, అటెండర్ వేధిస్తున్నారు.. రోడ్డెక్కి విద్యార్థినిలు ఆందోళన