Site icon NTV Telugu

KTR Tweet: ఓ తండ్రి మంత్రి KTRకు మెసేజ్.. అందులో ఏముందంటే..

Ktr Letter

Ktr Letter

KTR Tweet: సామాజిక మాధ్యమాల్లో, ట్విటర్‌ లో మంత్రి కేటీఆర్‌ నిత్యం చురుకుగా ఉంటారు. అంది అందరికి తెలిసిన విషయమే.. ప్రతి అంశాలపై స్పందిస్తూ కేంద్రంతో పాటు విపక్షాలపై తనదైన శైలిలో వ్యంగాస్ర్తాలు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటారు. మంత్రి అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇలా ఎవరు సాయం కోసం అభ్యర్థించినా వెంటనే స్పందిస్తూ.. వాళ్లకు తగినైన సాయం చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా వుంటూ.. కేటీఆర్‌ అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర విషయాలు కూడా నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఈనేపథ్యంలో ఓతండ్రి కేటీఆర్ కు రాసిన ఉత్తరాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆపోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ లెటర్ లో ఏముంది?

Read also: Rajastan Congress Crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

‘మా బాబును కాపాడిన దేవుడు మీరే’ అని ఓ తండ్రి మంత్రి KTRకు మెసేజ్ పంపారు. ప్రమాదంలో గాయపడి చావుబతుకుల్లో ఉన్న తమ కుమారుడికి సత్వర చికిత్స, CMRF నుంచి వైద్య ఖర్చులు ఇప్పించారని చిట్యాలకు చెందిన అశోక్ KTRకి కృతజ్ఞతలు తెలిపారు. ‘థ్యాంక్యూ రామన్న. దేవుడున్నాడో లేదో తెలియదు కానీ.. మీరు మాకు ఉన్నారనే ఒక ధైర్యం’ అని అశోక్ చెప్పగా.. ‘ప్రజాజీవితంలో తృప్తినిచ్చే సందేశాల్లో ఇది ఒకటి’ అని KTR బదులిచ్చారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా వేడుకలు.. 10 అవతారాల్లో అమ్మవారి దర్శనం

Exit mobile version