NTV Telugu Site icon

Rs.35 Lakh Stolen: హైదరాబాద్‌ లో దొంగల హల్ చల్‌.. రూ.35 లక్షలు దోపిడీ..

Thifs

Thifs

Rs.35 Lakh Stolen: హైదరాబాద్‌ లో దొంగలు హల్‌ చల్ చేస్తున్నారు. నగరంలో దారి దోపిడీ దొంగల ముఠా అమాయకులను హడలెత్తిస్తున్నారు. వ్యాపారస్తులే టార్గెల్‌ చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాత్రి ఒంటరి వ్యక్తులే టార్గెట్‌ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు దోచుకుని వెళ్లిన ఘటన గుడిమల్కాపూర్‌ లో సంచలనంగా మారింది.

Read also: Yadagirigutta Temple Board: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట కు టెంపుల్ బోర్డు..

హైదరాబాద్‌ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని తిబర్మల్ జ్యువెలర్స్ లో శ్రీకాంత్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ లాగానే బంజారాహిల్స్‌ లోని దుకాణం మూసి కార్మికుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బంజారాహిల్స్‌ నుంచి అత్తాపూర్‌ వైపు శ్రీకాంత్ బయలుదేరాడు. రేతి బౌలి ఎక్స్ రోడ్‌లోని పిల్లర్ నంబర్ 28 సమీపంలోని ఓ పాన్‌ షాప్‌ వద్ద పాన్‌ కొనడానికి ఆగాడు. అయితే అక్కడకు హెల్మెట్ ధరించి పల్సర్ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని శ్రీకాంత్‌ పట్టించుకోలేదు. అయితే శ్రీకాంత్‌ చేతిలో వున్న బ్యాగును ఆ ఇద్దరు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్‌ తన వద్ద వున్న బ్యాగును ఇచ్చేందు నిరాకరించాడు.

Read also: Women’s Waist : పెళ్లి తర్వాత ఆడవాళ్ల నడుము ఎందుకు పెరుగుతుందో తెలుసా ?

అయితే ఆ ఇద్దరు వ్యక్తులు శ్రీకాంత్ ను కిందపడేసి బ్యాగ్‌ లాక్కును అక్కడి నుంచి బైక్‌ పై పరారయ్యారు. అర్ధరాత్రి 12గం సమయంలో ఘటన జరిగింది. అయితే శ్రీకాంత్‌ తో తోటి కార్మికుడు కూడా ఉన్నాడు. పాన్‌ అమ్మే మనిషి, తోటి కార్మికుడు కూడా ఆ ఇద్దరు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. వారిద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే గుడిమల్కాపూర్‌ పోలీసులకు వద్దకు వెళ్లిన శ్రీకాంత్‌ ఘటనపై వివరించాడు. తన బ్యాగులు రూ. 35 లక్షలు వున్నట్లు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్‌ దగ్గర వున్న బ్యాగులో డబ్బులు వున్నట్లు దుండగులకు ఎలా తెలిసింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
AV Ranganath: నేడు అమీన్ పూర్ లో పర్యటించనున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్..