NTV Telugu Site icon

Thieves in Hyder Guda: హైదర్ గూడలో దొంగల హల్ చల్.. బంగారు, నగదుతో మాయం

Thieves In Hyder Guda

Thieves In Hyder Guda

దొంగల ముఠా హల్‌ చల్‌ సృష్టిస్తున్నాయి. తాళాలు వున్న ఇల్లకే టార్గెట్‌ చేస్తూ దొంగ తనాలకు పాల్పడుతున్నారు. నిన్నటి వరకు నగరంలో చెడ్డిగ్యాంగ్‌ హడల్‌ ఎత్తించిన విషయం తెలిసిందే. దాంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాళం వేసిన ఇల్లకే కాదు తాళవేయకున్నా వారిఇంటికి టార్గెట్‌ చేస్తే అది దోచుకోవాల్సిందే అన్నట్లుగా చెడ్డి గ్యాంగ్ వ్యవహారం వుండేది. ఇది పోలీసులకు సవాల్‌ విసిరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెడ్డీగ్యాంగ్ ఆగడాలను అరికట్టారు. దీంతో దొంగల హల్‌చల్‌ తగ్గాయి అనుకునేలోపే మళ్లీ దొంగల హల్ నగర వాసులకు భయభ్రాంతులకు గురిచేస్తోంది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్ గూడలో దొంగలు హల్‌ చల్‌ సృష్టించారు. న్యూ ఫ్రెండ్స్ కాలనీ లోని జయసూర్య అనే వ్యాపారవేత్త ఇంటిని దుండగులు గుళ్ల చేసారు. ఇంటి తాళాలు పగలగొట్టి బిరువాలో ఉన్న 40 తులాల బంగారు, 40 వేల నగదు తో పాటు వెండి ఆభరణాల అపహరించారు. గత నాలుగు రోజుల క్రితం జయసూర్య అనే వ్యాపారవేత్త కుటుంబ సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ముఠా సభ్యులు ఇల్లును దోచేసారు. ఇంటి మెయిన్ డోర్ లాక్ బ్రేక్ కావడం, ఇంట్లో ఉన్న సామానులు చిందర వందరగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించిన కాప్స్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న CC ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు. అయితే.. హైదర్ గూడలో దొంగతనం జరగడంతో.. స్థానికులు భయ భ్రాంతులకు గురవుతున్నారు. తాళం వేసి వెళ్లాలంటేనే జంకుతున్నారు.
Srisailam Temple: శ్రీశైలంలో గిరిజనరైతులకు గోసంరక్షణశాల కోడెదూడలు