Site icon NTV Telugu

Manchiryala: బ్యాంకులో దొంగకు వింత అనుభవం.. ఫన్నీ లెటర్ రాసి పరార్‌

Manchiryal

Manchiryal

Manchiryala: ఓ దొంగ బ్యాంకులో చోరీకి ప్రయత్నించాడు. సెక్యూరిటీ, సీసీ కెమెరాల కళ్లుగప్పి బ్యాంకులోకి ప్రవేశించాడు. ఈ దొంగతనం విజయవంతమైతే తన జీవితం సెటిల్ అయిపోతుందని.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుతానని కలలు కన్నాడు. అయితే చోరీకి వెళ్లిన దొంగకు వింత అనుభవం ఎదురైంది. బ్యాంకులో ఒక్క రూపాయి కూడా కనిపించలేదు. అందుకే ‘మంచి బ్యాంకు.. ఇక్కడ నాకు ఒక్క రూపాయి కూడా దొరకలేదు.. నన్ను పట్టుకోకు’ అంటూ సరదా లేఖ రాసి అక్కడి నుంచి పరారైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: ప్రెగ్నెన్సీలో వాంతులు.. పరిష్కారానికి చిట్కాలు

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలో గురువారం (ఆగస్టు 31) అర్ధరాత్రి ఓ దొంగ చోరీకి యత్నించాడు. సెక్యూరిటీ కళ్లు గప్పి, తాళం పగులగొట్టి బ్యాంక్ లోపలికి వెళ్లాడు. లాకర్‌ గదిలోకి చొరబడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. బ్యాంకులో వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దీంతో బ్యాంకులో నగదు చోరీకి గురికాలేదు. బ్యాంకులో ఏమీ దొరకకపోవడంతో ‘మంచి బ్యాంకు… ఒక్క రూపాయి కూడా లేదు… నన్ను పట్టుకోవద్దు… నా వేలిముద్రలు కూడా లేవు’ అని లేఖ రాసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం బ్యాంకు వద్దకు వచ్చిన అధికారులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. బ్యాంకులో దొరికిన లేఖ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Vaccine: చిన్న పిల్లలే కాదు.. పెద్దలు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ లు కూడా ఉన్నాయి

Exit mobile version