Site icon NTV Telugu

CM KCR: న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు.. హైదరాబాద్ లో పోదు

Cm Kcr Appaji Junction

Cm Kcr Appaji Junction

There will be no power cut in Hyderabad: న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర రూ. 6,250 కోట్లతో ఈ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ రాయదుర్గంలో మెట్రో విస్తరణ పనులకు కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ మార్గం రాయదుర్గం నుండి శంషాబాద్‌కు .31 నిమిషాలు పడుతుంది. ఈ మెట్రో రైలు త్వరగా విమానాశ్రయానికి వెళ్లడానికి సహాయపడనుంది. అనంతరం బహిరంగ సభాస్థలికి చేరుకుని ప్రసంగించారు 6,250 కోట్లతో మెట్రో రైల్ ప్రాజెక్టు కు శంఖుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. చెన్నై కంటే అనేక ఇతర నగరాల కంటే ముందే హైదారాబాద్ కి కరెంట్ వచ్చిందని అన్నారు. అద్భుతమైన విశ్వనగరంగా హైదరబాద్ ఉందని పేర్కొన్నారు.

Read also: Mandous : మొదలైన మాండుస్‌ బీభత్సం.. భారీ వర్షం.. తీర ప్రాంతాల్లో అలర్ట్‌..

వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ, GMR, HMDA నిధులతోనే ఈ మెట్రో నిర్మాణం జరుగుతుందని అన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో బాధ పడ్దామని అన్నారు మంచినీటి, కరెంట్ బాధలు చూసాము, అనుభవించామమని తెలిపారు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చానని సీఎం కేసీఆర్‌ అన్నారు. న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోదని కేసీఆర్‌ వ్యాఖ్యా నించారు. అనంతరం తెలంగాణ భవన్‌కు బయలు దేరారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ భవన్ పై BRS జెండాను కేసీఅర్ ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో.. తెలంగాణ భవన్ కు పార్టీ ప్రతినిధులు చేరుకుంటున్నారు. ఇవాళ్టి BRS ఆవిర్భావ కార్యక్రమంకు 4 వందల మందికి పైగా ప్రతినిధులకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మెట్రో ట్రైన్ వల్ల రవాణా సౌకర్యం మెరుగు అవుతుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి^సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో కార్యక్రమాలు సీఎం చేశారని, హైదారాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి సబితా వ్యాఖ్యానించారు.
Etela Rajender: ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదు

Exit mobile version