NTV Telugu Site icon

Jeedimetla CI: వివాహిత కిడ్నాప్ వార్తల్లో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన జీడిమెట్ల సీఐ

Jeedimetla Ci

Jeedimetla Ci

Jeedimetla CI: జీడిమెట్ల పియస్ పరిధిలో వివాహిత అదృశ్యమైందని వస్తున్న వార్తలపై జీడిమెట్ల సీఐ సిఐ పవన్ క్లారిటీ ఇచ్చారు. చింతల్ లో నివాసం ఉండే మిట్ట ఐశ్వర్య సోమవారం సాయంత్రం నుండి కనపడటం లేదని భర్త రాజేష్ ఫిర్యాదు చేశాడని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.ఐశ్వర్యను ఎవరో కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. తను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని అన్నారు. దాని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని జీడిమెట్ల సిఐ పవన్ తెలిపారు. సోమవారం రోజున ఐశ్వర్య అమ్మమ్మ అనసూయ ఇంటికి వచ్చి గొడవ పడిందని దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. గొడవ కారణంగా మనస్థాపంతో ఐశ్వర్య ఇంట్లో నుండి వెళ్లిందని ఐశ్వర్య భర్తే అంటున్నాడని పేర్కొన్నారు.

Read also: Tension in OU: ఓయూలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఐశ్వర్య కు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. గొడవకు గల కారణాలను ఆరాతీస్తున్నమని తెలిపారు. చిన్న చిన్న గొడవల కారణంగా పచ్చని జీవితాలలో చిచ్చు పెట్టుకుంటున్నారని అన్నారు. అభం శుభం తెలియని పిల్లలు దానికి గురవుతున్నారని అన్నారు. ఐశ్వర నడుకుంటూ వెళుతున్న సీసీ టీవీ ఫొటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఐశ్వర్య గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిందే కానీ.. ఆమెను ఎవరు కిడ్నాప్‌ చేయలేదని ఈ వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయవద్దని ప్రజలు భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని సూచించారు.
Gautam Adani : ప్రపంచంలోని టాప్- 20 బిలియనీర్ల జాబితాలోకి మళ్లీ గౌతమ్ ఆదానీ