Doctors Not Negligent: నాగర్ కర్నూలు జిల్లా ఎటువంటి వైద్య పరీక్షలు చేయకుండా ఓ బాలింత ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. అయితే కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీనిపై డాక్టర్ సునీత క్లారిటీ ఇచ్చారు. ఎన్ టీవీ తో డాక్టర్.సునీత మాట్లాడారు. ఇద్దరు బాలింతల మృతి పై ఎక్కడ వైద్యుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. అడ్మిట్ సమయంలో సిరివెన్నెలకి డెంగ్యూ ఫీవర్ లేదని, డెంగ్యూ ఉంటే మేము డెలివరీ చేయమని తెలిపారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డెలివరీ చేశామన్నారు. డెలివరీ ముందు అన్ని క్లియర్ గా చెక్ చేశామని సునీత తెలిపారు. డెలివరీ అయ్యాక సిరివెన్నెలకు హార్ట్ రేట్ ఎక్కువగా ఉందని, హాట్ ప్రాబ్లం కారణంగానే గాంధీకి తరలించామని క్లారిటీ ఇచ్చారు. మరో కేసులో శివానికి హైపోథైరాయిడ్ సమస్య ఉందని అన్నారు. బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్న కారణంగా నొప్పులు ఎక్కువ అవ్వడంతో శివానికి డెలివరీ చేశామన్నారు. హై రిస్క్ తీసుకొని శివానికి ఆపరేషన్ చేశామని తెలిపారు. శివానికి ఆపరేషన్ చేయకుండా ఉంటే ఇద్దరు ప్రాణాలు కోల్పోయేవారని సునీత మీడియాముందు స్పష్టం చేశారు. హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం ఎక్కడా లేదన్నారు. తమ విచారణలో వైద్యుల నిర్లక్ష్యం తేలితే చర్యలు తీసుకుంటామని డాక్టర్ సునీత ఈసందర్బంగా స్పష్టం చేశారు.
Read also: Payal Rajput: టవల్ చుట్టుకుని సెల్ఫీ ఏంటమ్మా.. పొట్టి నిక్కర్‌తో..
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన పి.మహేష్ ఆర్.సి.ఐ.లో కార్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. బరీస్ సిరి వెన్నెల రెండవ కాన్పు డెలివరీ కోసం సోమవారం నాడు మలక్ పేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమెకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే.. ఆపరేషన్ అనంతరం ఆమెకు తీవ్ర రక్త స్రావం, బీపీ పడి పోవడం, ఈసీజీలో మార్పులు రావడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో.. అక్కడి నుంచి బయలుదేరి ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు డెంగు ఫీవర్ ఉందని దీనివల్ల ఫ్లేట్ లెట్స్ పడిపోవడం జరిగిందని తెలిపారు.
Read also: Nandakumar Released: జైలు నుంచి విడుదలైన నందకుమార్.. షరతులతో కూడిన బెయిల్
అయినా ఇలాంటి సమయంలో ఆపరేషన్ చేయొద్దుకదా ఎలా చేయించారని కుటుంబ సభ్యులకు ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఆపరేషన్ చేయడంతోనే మృతి చెందినదని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. షాక్ కు గురైనా కుటుంబ సభ్యులు.. మృతురాలి భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని ఆరోపిస్తూ.. మాకు న్యాయం చేసి, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో ఆసుపత్రిలో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులను నమ్మి వచ్చి ప్రాణాలు గుప్పొట్లో పట్టుకుని వైద్య పరీక్షలు చేయించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాన్నరు. ఇప్పటి కైనా అధికారులు ఇలాంటి ఆసుపత్రులపై దృష్టి సారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Fit Ness Gym: జిమ్‌లో మైనర్ బాలికపై వేధింపులు.. శరీర భాగాలు తాకుతూ..