NTV Telugu Site icon

Hyderabad Metro: మెట్రో టైంలో మార్పులేదు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: మెట్రో సమయాలను పొడిగించాలనే ఆశలపై హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నీళ్లు చల్లింది. మెట్రో టైమింగ్స్ పొడిగింపు లేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 5.30, శుక్రవారం రాత్రి 11.45 కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, అనేక పరిశీలనల తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తాయన్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సర్వీసులను పొడిగించనున్నారు. పూర్తి అధ్యయనం తర్వాతే సమయపాలనపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు సమయాలను పొడిగించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ఖండించారు. మెట్రో ట్రాఫిక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు.

Read also: Weight Loss Tips : స్ట్రాబెర్రిలతో అధిక బరువుకు చెక్..

మెట్రో రైళ్లు యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండగా, ఇక నుంచి ఆ రైలు ఉదయం 11.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు మెట్రో సర్వీసు ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే మెట్రో రైలు సమయాల పెంపుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఈ టైమింగ్స్‌పై కేవలం పరిశీలన మాత్రమే చేశామని.. తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ, రైళ్ల లభ్యత, ట్రాక్ మెయింటెనెన్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వివరించారు. మెట్రో రైళ్ల సమయాలపై ప్రయాణికులు అయోమయం చెందవద్దని సూచించారు.
Palnadu: పల్నాడులో కొనసాగుతున్న అల్లర్ల కేసుల విచారణ