NTV Telugu Site icon

సికింద్రాబాద్ లో పదిహేను లక్షల విలువైన సెల్ ఫోన్స్ చోరీ…

సికింద్రాబాద్ శాంసంగ్ మొబైల్ స్టోర్ లో ఫోన్ లు చోరికి గురైన సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదిహేను లక్షల వరకూ విలువైన సెల్ఫోన్లోనూ గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు స్టార్ సిబ్బంది. నిన్న రాత్రి సమయంలో శామ్సంగ్ మొబైల్ స్టోర్ లోకి ప్రవేశించి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. లక్షల రూపాయల విలువైన సెల్ఫోన్లను అపహరించుకుని వెళ్లిపోయారు. ఉదయాన్నే మొబైల్ స్టోర్ కి వచ్చి చూసిన యజమాని ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. లక్షల రూపాయల విలువైన సెల్ఫోన్లు చోరీకి గురికావడంతో వెంటనే కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు.

దాంతో ఘటనా స్థలికి చేరుకున్న కార్ఖానా పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని 10 మంది వ్యక్తులు సెల్ఫోన్లను చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పక్కా ప్రణాళికతో దొంగలముఠా సెల్ఫోన్ లు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.