Assault on Woman: ఓ మహిళ ఈవెంట్స్ లో పనిచేస్తుంది. ఆ మహిళతో ఈమధ్యనే ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. రోజూ తనతో మాట్లాడాలని వేధించే వాడు. తనకు పెళ్లైందని చెప్పినా వినకుండా న్యూడ్ వీడియో కాల్ చేసేవాడు. అంతేకాకుండా.. తను కాల్ చేసినప్పుడల్లా తీయకపోతే చంపుతానని బెదిరించేవాడు. తన భర్తను వదిలేని తనతో ఉండాలంటూ వేధించేవాడు. దానికి ఆమహిళ నిరాకరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆఉన్మాది తన ఇంటికి వెళ్లి కోరిక తీర్చమన్నాడు. ఆమహిళ ఒప్పుకోకపోవడంతో.. తనతో తెచ్చుకున్న బీర్ బాటిల్ ను పగల గొట్టి ఆమహిళ గొంగుకోసాడు. అంతటితో ఆగక ఆమహిళ చేయి విరిచేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈఘటన హైదరాబాద్ లోని బేగంపేట్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని బేగంపేట్ కుందన్‌బాగ్ కాలనీలోని బిఎస్ మక్తాలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఈవెంట్ చేసుకుంటూ భర్త సూరజ్ తో పాటు నివాసం ఉంటోంది. ఈ మధ్యకాలంలో.. గతంలో జూబ్లీహిల్స్ పీఏ విజయ్ సింహకు ఫేస్ బుక్ లో ఆమెతో పరిచయం ఏర్పడింది. రాను రాను వీడియోకాల్స్‌లో ఇద్దరూ మాట్లాడుకునే వారు. తన భర్తను వదిలేసి తనతో ఉండాలంటూ బెదిరంచేవాడు. తన కోరిక తీర్చాలని న్యూడ్ వీడియో కాల్ చేసేవాడు. ఆమె ఫోన్ ఎత్తకపోయనా, భర్తకు చెప్పినా చంపేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో.. భర్త గతంలో పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేశాడు. ఇవాళ ఉదయం మహిళ ఇంట్లోకి విజయసింహా వచ్చాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయబోయాడు. ఆమె నిరాకరించడంతో బీర్ బాటిల్ పగలగొట్టి గొంతు కోసాడు. అంతేకాకుండా.. విజయసింహతో వచ్చిన మరొక వ్యక్తి ఆమె చేయిని విరిచేసి పిడుగుద్దులు గుద్దాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్త సూరజ్ కు వీడియో కాల్ చేసి తెలిపింది. ఇంటికి చేరుకున్న భర్త.. షాక్ తిన్నాడు. హుటాహుటిన భార్యను ఆసుపత్రికి తీసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NTV తో బాధితురాలి భర్త సూరజ్
NTV తో బాధితురాలి భర్త సూరజ్ మాట్లాడుతూ.. తమకు ప్రాణహాని ఉందని తెలిపాడు. ఫేస్ బుక్ లో పరిచయం తప్ప డైరెక్ట్ గా తన భార్యతో అతనికి ఎలాంటి పరిచయాలు లేదని స్పష్టం చేశాడు. నన్ను వదిలేసి రావాలని, లేకపోతే చంపేస్తానని విజయ్‌సింహ తన భార్యను పలుమార్లు బెదిరించాడని పేర్కొన్నాడు. తన వెనుక చాలా మంది రౌడీషీటర్లు ఉన్నారని బెదిరించాడని తెలిపాడు. నా భార్యకు న్యూడ్ వీడియో కాల్ చేసే వాడని, కాల్ లిఫ్ట్ చేయకపోయినా, మాట్లాడకపోయినా చంపుతానని బెదిరించేవాడని బాధితురాలి భర్త ఎన్టీవీతో తెలిపాడు. పోలీసులు వారికి రక్షణ కల్పించాలని కోరాడు.
