NTV Telugu Site icon

వేటగాళ్ల చేతిలో బలైన పులి.. చివరికి

వేటగాళ్ల చేతిలో పులి బలైన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొందరు నిందితులు పులికోసం ఉచ్చు బిగించి పులిని హతమార్చినట్లు తెలుస్తోంది. పులి చర్మాన్ని కాగజ్‌నగర్‌ కు తరలిస్తుండగా వారు పట్టుబడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో నిందితుల నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండ సమీపంలో గల హీరాపూర్‌ అటవీప్రాంతంలో పులిని చంపినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.